నా చిన్ని బాబు..నా ప్రాణానికి హ్యాపీ బర్త్‌ డే!

అల్లు అయాన్‌… బన్నీ కొడుకుగా మాత్రమే కాకుండా చిన్న వయసులోనే తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకుంటున్నాడు. బుధవారం అయాన్ పుట్టినరోజు సందర్బంగా బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతూ విషెష్ తెలుపుతున్నారు..అల్లు అయాన్ ని మోడల్ అయాన్ అని సరదాగా పిలుచుకుంటారు.  ఇక అల్లు అర్జున్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో  అయాన్ గురించి మోడల్ అన్నట్టు సింబల్ చూపించాడు.

దానికే మోడల్ అయాన్ అంటూ బాగా పాపులర్‌  అయ్యాడు.. సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపించిన తనలోని ఏదోక టాలెంట్ బయటపెడుతూ అందరిని ఆకర్షిస్తాడు. మొన్నీమధ్య షారుఖ్ పాటను పాడాడు. ఆ వీడియో ఇప్పటికి వైరల్ అవుతూనే ఉంది. ఈరోజు అయాన్ బర్త్‌ డే సందర్భంగా తనకి సినీ ప్రముఖులు కూడా బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు.

ఈ క్రమంలోనే  అల్లు అర్జున్ కూడా తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు. నా చిన్ని బాబు.. నా ప్రాణం అల్లు అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్ చేశాడు.

ఎంత బిజీగా ఉన్న కొడుకు పుట్టినరోజును మిస్ అవ్వడు అల్లు అర్జున్.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories