అప్పన్న నా ఫేవరేట్‌!

అప్పన్న నా ఫేవరేట్‌! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా మావెరిక్ డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కించిన భారీ మూవీ “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ మూవీ దారుణంగా నెగిటివ్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

అయినా కూడా ఈ సినిమా దాదాపు సగానికి పైగా రికవర్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాల్లో టాక్. అయితే ఈ సినిమాలో సాలిడ్ హైలైట్ అయిన ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి.మరి ఇందులో సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఒకటి. దీంతో ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విడుదలని తాను చేస్తున్నట్టుగా తేల్చి చెప్పాడు. అయితే ఇందులో కొంచెం ఆలస్యం అవుతుంది అని తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. 

కొన్ని టెక్నికల్ కారణాలు రీత్యా రేపు ఫిబ్రవరి 2న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా తెలిపాడు. అలాగే ఈ ఓఎస్టీలో తనకి అప్పన్న ట్రాక్ చాలా ఇష్టం తాను తెలిపాడు. అలాగే మెగా అభిమానులు కూడా అప్పన్న ట్రాక్స్ కోసం చాలా ఎదురు చూస్తున్నామని అంటున్నారు. మరి గేమ్ ఛేంజర్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ రామ్ చరణ్ పోషించిన అప్పన్న పాత్రకి మళ్ళీ రంగస్థలం తర్వాత అంతకు మించిన ప్రశంసలు చరణ్ పైనే కురిశాయి. ఇందుకే ఈ ట్రాక్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories