అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమా గుర్తుందా.. తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డులు క్రియేట్ చేసిన సినిమా రేసుగుర్రం. అల్లు అర్జున్ తన కామెడీ టైమింగ్, తన యాక్షన్ తో అదరగొట్టాడు. సినిమా భారీ విజయం సాధించడంతో బన్నీ హిట్ లిస్టుల ఖాతాలో ఒక సినిమా గా చేరిపోయింది. ఈ సినిమాలో బన్నీని ఎంత బాగా గుర్తు పెట్టుకుంటారో..గుర్తు పెట్టుకోవాల్సిన మరో వ్యక్తి కూడా ఉన్నాడు.
అతను మరెవరో కాదు సినిమాలో విలన్ గా నటించిన మద్దాల శివారెడ్డి. తెలుగులో మొదటి సినిమానే అయినప్పటికీ తనదైన యాక్షన్ మార్క్ చూపించాడు. కామెడీకి కామెడీ..విలనిజానికి విలనిజం పండించి తెలుగు పరిశ్రమకు మరో విలన్ దొరికాడు అనిపించాడు. భోజ్‌పూరి నటుడే అయినప్పటికీ తెలుగు విలన్ గా బాగా సరిపోయాడు.
రేసుగుర్రం సినిమా తరువాత రవి కిషన్ మరి కొన్ని సినిమాల్లో విలన్ గా నటించాడు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల వైపు వెళ్లారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవికిషన్ తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. మా నాన్న కి చాలా కోపం ఎక్కువ. ఆయన పూజారిగా చేసేవారు. నన్ను కూడా పూజారి కానీ, వ్యవసాయం కానీ, లేక ఏదైనా ప్రభుత్వోద్యగం చేయాలని చెప్పేవారు.
నేను నటుడ్ని అవుతాను అంటే ఒప్పుకోకపోగా బాగా కోపం చూపించారు. ఆ సమయంలో ఆయన నన్ను చంపేయాలని కూడా చూశారు. ఆయన కోపంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినరు. ఆ సమయంలో మా అమ్మ ఒక 500 రూపాయలు ఇచ్చి ఇంట్లో నుంచి పారిపోమ్మని చెప్పింది. వాటిని తీసుకుని నేను ముంబై రైలు ఎక్కేశాను.
ఆ తరువాత నేను చాలా కాలం పాటు ఇంటి ముఖం చూడలేదు. సినిమాల్లో కొంచెం పేరు సంపాదించుకున్న తరువాత వెళ్తే ఆయన నన్ను చూసి గర్వపడుతున్నాను అని చెప్పారు. ఆనాడు మా నాన్న నన్ను కొట్టిన దెబ్బలే ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని భావోద్వేగానికి గురయ్యారు. నాన్న చివరి రోజుల్లో కూడా నా గురించి చాలా గొప్పగా అందరికీ చెప్పేవారని రవి కిషన్ తెలిపారు.