తెలుగు, తమిల సినిమాలతో వరుస అవకాశాలు వచ్చిన తరువాత ఇక్కడ అందివచ్చిన అవకాశాలను వదులుకొని ముద్దుగుమ్మలు బాలీవుడ్ కి చెక్కేయడం కామనే. ఇప్పటికీ కొత్తమంది హీరోయిన్లు అలానే చేస్తుంటారు. ఈ క్రమంలోనే గోవా భామ ఇలియానా కూడా ఇలాగే బాలీవుడ్ మోజులో పడి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి చాలా సంవత్సరాలు పాటు అక్కడే సెటిలైంది.
ఆ తరువాత ఇబ్బందులు ఎదురవ్వడంతో మళ్లీ తెలుగు సినీ ప్రపంచం వైపు చూసింది. కానీ ఆమెకు అవకాశాలు వచ్చినా పెద్దగా ఉపయోగపడలేదు. వరుస డిజాస్టర్స్ తో కెరీర్ ముగిసిపోతుందని అనుకుంటున్న నేపథ్యంలో పెళ్లలి చేసుకొని , ఓ బిడ్డను కని హ్యాపీగా ఉంటుంది.
పెళ్లయిన తర్వాత బాలీవుడ్ లో ఒకటి అర అవకాశాలు వస్తుంటే వాటిని చేస్తూ హ్యాపీ హ్యాపీగా గడిపేస్తోంది. ఇక తాజాగా ఆమె చేసిన ఒక సినిమా ప్రమోషనల్ ఆక్టివిటీస్ లో తెలుగు సినీ పరిశ్రమ గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. రవితేజతో చేసిన దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత బాలీవుడ్ కి వచ్చానని అప్పటి నుంచే తెలుగు ఆఫర్స్ రాలేదని ఆమె చెప్పుకొచ్చింది.
తెలుగు సినీ పరిశ్రమలో బిజీగా ఉన్న టైమ్ లోనే బాలీవుడ్ లో బర్ఫీ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నిజానికి టాలీవుడ్ లో చాలా సినిమా అవకాశాలు నాకు ఉన్నా సరే ఎందుకో బర్ఫీ అవకాశాన్ని మాత్రం వదులుకోవాలి అనిపించలేదు. నేను జడ్జ్ చేసినట్టుగానే ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఆ సినిమా హిట్ కావడంతో తెలుగులో ఆమె ఇంకా నటించదు అని కొంతమంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీలో ప్రచారం మొదలుపెట్టారు.
ఆ ప్రచారంతో తెలుగులో సినిమా అవకాశాలు ఇస్తారు అనుకున్న వాళ్లు కూడా నాకు ఇవ్వలేదు. నేను ముంబైలో ఉండడం వల్ల ఇక్కడే సెటిల్ అయిపోయాను అని అందరూ అనుకున్నారు. నేను ఏ ఇండస్ట్రీలో నటించినా ఎంతో నిజాయితీగానే పని చేశానని ఈ సందర్భంగా ఇలియానా చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను పడిన కష్టానికి తగ్గ గుర్తింపు దక్కలేదేమో అని తాను ఫీల్ అవుతున్నానని ఆమె చెప్పకు వచ్చింది.