పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా ఓజిపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, పోస్టర్లు భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ముందుకు సాగుతోంది.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా గురించి కొత్త సమాచారం షేర్ చేశాడు. ఆయన చెప్పినదాని ప్రకారం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ వేగంగా కొనసాగుతోంది. లండన్‌లోని అబ్బీ రోడ్ స్టూడియోస్‌లో 117 మంది మ్యూజిషియన్స్‌తో ఈ రికార్డింగ్ వర్క్ జరుగుతోందని థమన్ వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది.
థమన్ చూపుతున్న కష్టపాటు, డెడికేషన్ చూసి ఫ్యాన్స్ ఆనందపడుతూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.