చేసింది హత్య.. నింద మాత్రం తెదేపా మీద!

జనసేన పార్టీకి చెందిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుత, ఆమె భర్త చంద్రబాబు లతో పాటు వారి అనుచరులను కూడా తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఒక హత్యకేసులో వారి పాత్ర ప్రాథమికంగా నిర్దరణ కావడంతో ఈ అరెస్టు జరిగింది. వినుత పీఏగా పనిచేస్తున్న వ్యక్తిని కొట్టి హత్య చేసి, శవాన్ని తీసుకువెళ్లి తమిళనాడులోని ఒక కాలువలో పడేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తర్వాత అరెస్టు జరిగాయి. మొత్తానికి జనసేన పార్టీ నుంచి ఆమెను, ఆమె భర్తను కూడా బహిష్కరిస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఆమె చేసిన హత్య కారణంగా అరెస్టు అయితే.. ఈ వ్యవహారం వెనుక తెలుగుదేశం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారని, ఆయన కుట్ర చేసి రాజకీయం తనను అడ్డు తొలగించుకోవాలని అనుకుంటున్నారని వినుత నిందలు వేస్తున్నారు.

పీఏను హత్య చేయించడం వెనుక రకరకాల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. వినుత దంపతులు బెడ్ రూంలో ఉన్న సమయంలో, ప్రైవేటు సమయంలో పీఏ శ్రీనివాసులు అలియాస్ రాయుడు (25) కొన్ని వీడియోలు తీసినట్టుగా వారు గుర్తించారు. అందువల్ల అతడిని తమకే చెందిన రేణిగుంట సమీపంలోని ఒక గోడౌన్ లో నిర్బంధించి చితక్కొట్టారు. ఆ కొట్టడంలోనే పీఏ రాయుడు మరణించడం కూడా జరిగింది. అక్కడినుంచి తమ కార్లలోనే తీసుకుని చెన్నై బేసిన్ బ్రిడ్జి సమపీంలోని కూపం కాలువలో పడేశారు. శవం కొట్టుకుపోతుందని అనుకున్నారు గానీ.. కొంత దూరం వెళ్లాక అది ఉబ్బిపోయి బయటపడడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ సహాయంతో దర్యాప్తు చేశారు.

శవాన్ని తీసుకువచ్చిన వాహనాలు, వచ్చిన వ్యక్తులను గుర్తించి మొత్తానికి వినుత చిరంజీవి దంపతులను అనుచరులను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. విచారణలో నిందితులు హత్య చేసినట్టు ఒప్పుకున్నారు కూడా. జనసేన పార్టీ వినుతను బహిష్కరించింది.
ఇక్కడితో ఆమె రాజకీయ జీవితం సమాధి అయిపోయినట్టే. కూటమి గా మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడే.. వినుత రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కానీ.. ఆమె ఎన్నికల ప్రచార సమయంలో తెలుగుదేశానికి పెద్దగా సహకరించలేదు. నిజానికి ఎటూ కూటమి గెలుస్తుందనే అభిప్రాయం ఉన్నప్పుడు.. ఎమ్మెల్యేకాగల వ్యక్తికి సహకరిస్తే నామినేటెడ్ పదవులు పొందవచ్చునని అనుకుంటారు. కానీ.. ఆమెభిన్నంగా వ్యవహరించారు.

సహకరించకపోగా.. ఇప్పుడు తన మీద హత్యానేరం పడడం వెనుక బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించడం తమాషాగా ఉంది. రాజకీయంగా అక్కడ ఏమాత్రం అస్తిత్వం, విలువ లేని ఆమెను ఎమ్మెల్యే ఎందుకు టార్గెట్ చేస్తాడో అర్థం కాని సంగతి. జనసేన బహిష్కరించేసిన తర్వాత.. ఎమ్మెల్యే మీద నిందలు వేస్తే.. వైసీపీ అండ దొరుకుతుందని ఆమె ఆశిస్తున్నారేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories