పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ నేతల హత్యాకాండ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని కూడా శాసించగలిగే స్థాయి నాయకుడిగా కొందరు చెప్పుకుంటూ ఉండే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో తెలుగుదేశం కార్యకర్త దారుణంగా హత్యకు గురయ్యారు. జగన్ ప్రభుత్వ పాలన జరుగుతున్న రోజుల నుంచి ఆయన మీద కక్ష కట్టిన.. వైసీపీ నాయకులు.. సరైన అదనుకోసం మాటు వేసి మరీ అంతమొందించడం గమనార్హం. ఎన్నికల నాటి కక్షలు, ఎన్నికల ఫలితాల నాడు తీవ్రరూపం దాల్చి వైసీపీ వారి దాడిగా రూపొంతరం చెందగా.. ఇప్పుడు ఏకంగా హత్యకే దారితీశాయి. కాగా.. దాడిజరిగినప్పుడు కేసులు పెట్టినా, వారినుంచి తన ప్రాణాపాయం ఉన్నదని పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన పోలీసుల్లో ఓ సీఐ, హెడ్ కానిస్టేబుల్ లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

వివరాల్లోకి వెళితే.. పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురానికి చెందిన రామకృష్ణనాయుడు (55) తెలుగుదేశం క్రియాశీల కార్యకర్త. ఎన్నడో 20 ఏళ్ల కిందట తెలుగుదేశం పార్టీ కేటాయించిన ఇంటి స్థలంలో రామకృష్ణనాయుడు, జగన్ పాలన కాలంలో ఇల్లుకట్టుకునే ప్రయత్నం చేశారు. దానికి గ్రామంలోని వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. అప్పుడే వారి మధ్య వివాదం నడిచింది. ఎన్నికల సమయానికి రామకృష్ణ నాయుడు పోలింగ్ ఏజెంటుగా కూర్చున్నారు. తీరా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు గ్రామంలో టపాసులు కాల్చి,  కేక్ కట్చేసి సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. రాజకీయపరమైన పాత తగాదాలన్నీ మనసులో ఉంచుకున్న వైసీపీ కార్యకర్తలు ఆయన మీద దాడికి తెగబడ్డారు. ఆయన భార్య ను కూడా గాయపరిచారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు.. ఇరువర్గాల మీద కేసులు పెట్టారు.

అప్పటినుంచి రామకృష్ణనాయుడు మీద గ్రామంలోనే నాలుగుసార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. రెండువారాల కిందట కూడా.. తన పొలంలోకి మట్టి తరలిస్తుండగా.. ట్రాక్టరు డ్రైవరుతో వైసీపీ వారు గొడవపెట్టుకుని..  రామక్రిష్ణను కూడా కొట్టారు. సీఐకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. గట్టిగా నిలదీయడంతో.. కొంచేపు సెల్ లో ఉంచి పంపేసినట్టుగా చెబుతున్నారు.

ఆ తర్వాత శుక్రవారం రాత్రి నరసింహస్వామి ఊరేగింపులో వైసీపీ వారు దాడికి దిగి, గలాభా చేశారు. ఘర్షణ జరిగింది. తీరా శనివారం ఉదయం రామక్రిష్ణ కొడుకు సురేష్ ఓ దుకాణం వద్ద కూర్చుని ఉండగా.. వైసీపీ కార్యకర్తలు వచ్చి సురేష్ మీద కత్తులతో దాడిచేశారు. గాయపడగానే సురేష్ అక్కడినుంచి పారిపోయాడు. అదే సమయానికి అక్కడకు ట్రాక్టరులో వస్తున్న వైసీపీకి చెందిన వెంకటరమణ దాడిచేసి మెడపై నరికాడు. ఆస్పత్రికి తరలించేలోగానే రామక్రిష్ణ మరణించాడు.

మొత్తానికి జగన్ జమానాలో విచ్చలవిడిగా సాగిన రాజకీయ హత్యలు, దమనకాండలు  ఇంకా కొనసాగుతున్నట్లుగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ వారి దుర్మార్గాలకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం త్వరలోనే అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories