ఇది సౌత్ ఇండస్ట్రీలో ఇటీవల సంచలనం సృష్టించిన చిత్రాల్లో ఒకటి లోక చాప్టర్ 1. యంగ్ హీరో నెస్లన్, హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను డైరెక్టర్ డామినిక్ అరుణ్ తెరకెక్కించారు. మలయాళ సినిమా నేపథ్యంలో మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమాల పరిశ్రమలో కూడా ఒక ప్రత్యేకమైన సూపర్ హీరో ఫ్రాంచైజ్‌గా ఈ చిత్రం గుర్తింపు పొందింది.
వీటితో పాటు వసూళ్ల పరంగా కూడా సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. 300 కోట్ల గ్రాస్ వసూళ్లతో సినిమా మరో రికార్డు సృష్టించింది. ఈ విజయంతో కళ్యాణి ప్రియదర్శిన్ కూడా సౌత్‌లో ఇలాంటి పెద్ద హిట్ సినిమా చేసిన హీరోయిన్‌గా తన పేరు నిలుపుకుంది.