ఓజీలో నా పాత్ర ఇదే అంటున్న ముద్దు గుమ్మ

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’పై అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నటిస్తున్న నటి శ్రియా రెడ్డి తన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. ఆమె చెప్పినదాని ప్రకారం, ఈ సినిమాలో తన పాత్ర చాలా శక్తివంతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులపై మంచి ఇంపాక్ట్‌ చూపించేలా రూపుదిద్దుకుందని చెప్పింది.

తన లుక్, నటన రెండూ సహజత్వానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ రోల్‌ చేయడం తనకు చాలా ఆనందం కలిగించిందని శ్రియా రెడ్డి చెప్పింది. కొత్తగా, సాహసంగా ఉండే పాత్రలు చేయడం తనకు ఎప్పటినుంచో ఇష్టమని, ‘ఓజీ’లో తాను పోషిస్తున్న రోల్ కూడా అచ్చం అలాంటిదేనని తెలిపింది.

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ను కూడా బలంగా చూపించబోతున్నారని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే పవన్ శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌, సుజీత్ స్టైలిష్ మేకింగ్, థమన్ సంగీతం, అలాగే బలమైన నటీనటులు కలిసి ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories