ప్రభాస్‌ తల్లిగా మృణాల్ ఠాకూర్‌..అసలు ట్విస్ట్ ఏంటంటే!

మరో రెండు రోజుల్లో కల్కి సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మూవీ అప్డేట్స్, అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కల్కి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ ఆడియన్స్ లో ఆసక్తి పెంచాయి. కాగా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీలో చాలామంది స్టార్స్ నటించిన విషయం తెలిసిందే.

ప్రభాస్ కి జోడిగా దీపికా, విలన్ గా కమల్ హాసన్, అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్ యాక్ట్‌ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. సినిమాలో ప్రభాస్ తల్లిగా మృణాల్ ఠాకూర్ కనిపించనుందట. ఇప్పటివరకు కల్కి నుంచి విడుదలైన ట్రైలర్స్ ను బట్టి చూస్తే సినిమాలో ప్రభాస్ తల్లిగా దీపికా పదుకొనె కనిపించనుందని, ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశాడని తెలుస్తుంది.ట్రైలర్స్ చూసిన ఆడియన్స్ కూడా ఇదే ఫిక్స్ అయ్యారు. కానీ అది నిజం కాదని తాజా సమాచారం. కల్కి లో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

అయితే సినిమాలో భైరవ తల్లి పాత్రను మృణాల్ ఠాకూర్ పోషించిందని సమాచారం. భైరవ చిన్నప్పటి సన్నివేశాల్లో మృణాల్‌ పాత్ర కనిపిస్తుందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories