సీతారామం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమతో పాటు అభిమానుల గుండెల్లో కూడా సీతామహాలక్ష్మిగా స్థిరపడిపోయింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన సీతగా చేసి తనకంటూ ఓ గుర్తింపు ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ నాని సరసన నటించి మంచి పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దు గుమ్మ. శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బేబీ కియారా ఓ కీలక పాత్ర పోషించింది.
కాగా హాయ్ నాన్న చిత్రంలో తండ్రి కూతుళ్ల బంధం గురించి చాలా చక్కగా చూపించారు. తల్లి పాత్రలో మృణాల్ కూడా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఇక కొన్ని సార్లు ఆన్ స్క్రీన్ లో ఏర్పడిన బంధాలు ఆఫ్ స్క్రీన్ లో కంటిన్యూ అవ్వడం చూస్తుంటాం. అలాంటిదే మృణాల్ బేబీ కియారా మధ్య అనుబంధం ఉందని తెలుస్తోంది. హాయ్నాన్న సినిమాలో నటించిన బేబి కియారాతో తనకు అలాంటి అనుబంధం ఏర్పడిందని తెలిపింది.
‘వయస్సులో నాకంటే చాలా చిన్నది అయినా నన్ను యష్నా లేదా ”ఎం” అని పిలుస్తుంది. తానే ఎప్పటికీ నా మొదటి పాపే. నాకు పిల్లలు పుట్టిన వారు నాకు రెండో సంతానమే అవుతారు…ఎందుకంటే కియారాతో ఏర్పడిన అనుబంధం అలాంటిది. తను కళ్లతోనే ఎన్నో విషయాలను మాట్లాడేస్తుంది. తన నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవచ్చు’ అంటూ సినిమా షూటింగ్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో మృణాల్ పోస్ట్ చేసింది.
దీంతో దీని గురించి స్పందించిన చిన్నారి కియారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను .మిమ్మల్ని కలవడం నా లక్. ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం నాకు ఉండాలి. త్వరలోనే నన్ను కలవండి అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి మృణాల్ రెండు హార్ట్ సింబల్స్ ను రిప్లైగా ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ పోస్టులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.