‘బబుల్ గమ్’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్ కనకాల. ఆ సినిమా తర్వాత తన నెక్స్ట్ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్‌తో కలిసి చేసేందుకు సిద్ధమయ్యాడు. ‘మోగ్లీ 2025’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ అడ్వెంచర్ మూవీని ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేశారు. అయితే, తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.
‘మోగ్లీ 2025’ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లు తాజాగా ఓ వీడియో గ్లింప్స్‌తో రివీల్ చేశారు. ఓ సైలెంట్ లవ్ స్టోరీ కోసం జరిగే వార్‌ను మోగ్లీ చిత్ర రూపంలో చూపించబోతున్నట్లు ఈ వీడియోలో మనకు తెలిపారు. ఇక ఈ వీడియోలో రోషన్ కనకాలతో పాటు హీరోయిన్ సాక్షి సాగర్ మధోల్కర్ కూడా కనిపించింది.
ఈ సినిమాకు పలువురు కొత్త టెక్నీషియన్లు పనిచేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.