టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విడుదల అయిన ప్రతి భాషలో హనుమాన్ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది.ఇదిలా ఉంటే పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మూవీ ‘హనుమాన్’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.
చిన్న సినిమాగా విడుదల అయిన ”హనుమాన్” మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో హనుమాన్ మూవీ ఏకంగా 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఇంతటి ఘన విజయం సాధించిన హనుమాన్ సినిమా విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా వేడుకలను నిర్వహించింది.
ఈ 100 రోజుల సెలబ్రేషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. హనుమన్ యాభై రోజుల వేడుక జరిగిన సమయంలో నిర్మాత నిరంజన్ గారు మనం వంద రోజుల వేడుక కూడా చేస్తామని గట్టి నమ్మకంతో అన్నారు. కానీ ఆ మాట నేను అంతగా పట్టించుకోలేదు. కానీ ప్రేక్షకులంతా దాన్నినిజం చేసి చూపించారు. నేను దర్శకుడిగా మారిన తరువాత ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే అది కేవలం వారం మాత్రమే థియేటర్ లో ఉంటుంది.
ఇలాంటి పరిస్థితిలో కూడా హనుమాన్ మూవీని వందవ రోజు కూడా థియేటర్స్ కి వచ్చి సినిమా చుస్తున్నారంటే అది మా సినిమా అదృష్టంగా భావిస్తున్నాం అని ప్రశాంత్ వర్మ తెలిపారు. అలాగే తాను తెరకెక్కించబోయే జై హనుమాన్ సినిమాలో పాత పాత్రలు కొనసాగుతూనే మరిన్ని సర్ప్రైజింగ్ పాత్రలు వచ్చి చేరతాయని ప్రశాంత్ వర్మ తెలిపారు. జైహనుమాన్ సినిమాని బిగ్గెస్ట్ ఫిల్మ్ గా తెరకెక్కిస్తున్నాం. గొప్ప ఎమోషన్స్ కనెక్ట్ వీఎఫ్ఎక్స్ ఈ సినిమాలో వుంటాయని ప్రశాంత్ వర్మ వివరించారు.