ఆళ్ల నాని వచ్చాక వెలుగులోకి మరిన్ని జగన్ అరాచకాలు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అనేది పెద్ద విషయం కాదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ 151 నుంచి 175 సాధిస్తానంటూ ఓవరాక్షన్ చేసి చేసి.. చివరికి 11 కు పడిపోయిన జగన్ బలం మీద, భవిష్యత్తు మీద ఆ పార్టీలోని వారికే అనేక సందేహాలు ఉన్నాయి. జగన్ ను నమ్ముకుని వైసీపీలోనే కొనసాగుతూ ఉంటే తమ రాజకీయ జీవితం మొత్తం అంధకారబంధురం అయిపోతుందనే భయం వారిలో ఉంది. సాధారణంగా ఓడిపోయిన పార్టీనుంచి ఒకరో ఇద్దరో ఫిరాయించి అధికారంలో ఉన్న పార్టీవైపు వెళుతుంటారు. గత జగన్ కాలంలో అయిదేళ్లు వాళ్లు ప్రలోభపెడుతూ, బెదిరిస్తూ ఉండగా.. కేవలం ముగ్గురు మాత్రమే పార్టీ మారారు. అదే ఇప్పుడు జగన్ ఓడిపోయిన తీరు చూసి కంగారు పడిన ఆ పార్టీ నేతలు గుంపులుగుంపులుగా రాజీనామాలు చేసేస్తున్నారు. కూటమి పార్టీల్లో చేర్చుకుంటే చేరడం లేదా మిన్నకుండడం బెటర్ అనుకుంటున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాజకీయాలే చాలించేయాలి అనే ఉద్దేశంతో వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని ఇప్పుడు తెలుగుదేశంలో చేరబోతున్నారు. రాజీనామా చేసే నాటికి ఆయన రాజకీయాలనుంచి తప్పుకోవాలనే అనుకున్నారు. అయితే ఆ తర్వాత అనేక సమీకరణలు, కొందరు ఆత్మీయులు చేసిన సూచనల వల్ల ఆళ్ల నాని టీడీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. కాకపోతే ఆయన చేరిక ముహూర్తమే వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల ఒకసారి ఆళ్లనాని చేరికకు ముహూర్తం పెట్టారు. అది కాస్తా కుదర్లేదు. తాజాగా గురువారం చేరాలని అనుకోగా, చంద్రబాబునాయుడు అందుబాటులో లేకపోవడంతో.. అది కూడా వాయిదా పడింది. మరో మంచి ముహూర్తం చూసుకుని చేరుతారని ప్రచారం జరుగుతోంది.

ఇదంతా ఒక వైపు కాగా, ఆళ్ల నాని టీడీపీలో చేరిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలం నాటి అరాచకాలు మరింతగా వెలుగులోకి వస్తాయని పలువురు అంచనావేస్తున్నారు. జగన్ కు స్వయానా మామయ్య కూడా అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వీడి జనసేనలో చేరిన తర్వాత.. సెకి ఒప్పందాలు ఎంత దారుణంగా జరిగాయో, విద్యుత్తు మంత్రిని కూడా పక్కన పెట్టి.. ఎలాంటి అరాచకత్వం నడిపించారో అందరికీ అర్థమైంది. ఆయనే స్వయంగా అప్పటి బాగోతాలన్నీ వెల్లడించారు. అదే తరహాలో ఆళ్ల నాని కూడా.. అప్పటి అరాచక వ్యవహారాల గుట్టు బయటకు తెస్తారని పలువురు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories