ఈసారి మరింత విధ్వంసం!

నందమూరి నటసింహం ఇపుడు నందమూరి బార్న్ కింగ్ గా మారి చేసిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రమే “డాకు మహారాజ్”. ఎన్నో అంచనాలు నడుమ ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సాలిడ్ వసూళ్లు అందుకుంది. ఇలా థియేటర్స్ లో అదరగొట్టిన ఈ సినిమా ఇటీవల దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రాగా మరోసారి ఈ చిత్రం అదరగొడుతుంది.

ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్ గా సినిమా ట్రెండ్ అవుతుంది. కానీ ఓటిటిలో వచ్చాక కూడా డాకు మహారాజ్ ఆడియెన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటుంది. సినిమాలో చాలా విషయాలు కోసం సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

దర్శకుడు బాబీ టేకింగ్, థమన్ మ్యూజిక్, విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా వర్క్ అలాగే నిర్మాతల నిర్మాణ విలువల కోసం చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మెయిన్ గా బాలయ్య విశ్వరూపం అయితే థియేటర్స్ మిస్ అయ్యినందుకు చాలామంది బాధ పడుతున్నామని అంటున్నారు. ఇలా ఓటిటిలోకి వచ్చాక కూడా డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories