విశ్వంభర నుంచి మాంటేజ్ సాంగ్‌ !

మెగాస్గార్ చిరంజీవి కథానాయకుడిగా … యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్‌ లో విశ్వంభర అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌ గా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్‌, త్రిష 18 సంవత్సరాలు తరువాత ఈ చిత్రంతో మళ్లీ జత కడుతున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లో మొదలు కానుంది. నగరంలోని వివిధ లోకేషన్స్‌ లో  ఓ యాక్షన్‌ షెడ్యూల్‌ చిత్రీకరిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సీన్‌ లో చిరంజీవితో పాటు మరికొంత మంది నటీనటులు కూడా ఈ సీన్‌ లో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ యాక్షన్‌ సీన్‌ తరువాత ఏప్రిల్‌ మొదటి వారం నుంచి రామోజీ ఫిల్మ్‌ సిటీలో మెగాస్టార్ మీద ఓ మాంటేజ్‌ సాంగ్‌ ను షూట్‌ చేస్తున్నారట.

ఈ సాంగ్ లో విశ్వంభర పాత్ర తాలుకూ గ్రాఫ్‌ ను చూపిస్తారని … కథకు సంబంధించి ఈ మాంటేజ్ సాంగ్‌ చాలా కీలకం అని చిత్ర బృందం వెల్లడించింది. ఈ పాటలో సృష్టి, స్థితి,లయ ఈ మూడింటి నేపథ్యంలో సాగే సోషియో ఫాంటసీ పాటగా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది.

ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తుంది. ఈ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories