అమ్మ..వార్నర్‌..అంత తీసుకున్నావా?

అమ్మ..వార్నర్‌..అంత తీసుకున్నావా? హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్‌హుడ్ మార్చి 28న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అలరించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. 

ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. ఇందులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమాతో వార్నర్ ఇండియన్ సినిమాలోకి అడుగుపెడుతున్నాడు. కాగా, ఈ సినిమాలో ఆయనది కేవలం కేమియో పాత్ర కాదని.. మంచి స్కోప్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. 

దాదాపు 5 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో వార్నర్ కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో నటించినందుకు గాను డేవిడ్ వార్నర్ ఏకంగా రూ.2.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తన పాత్ర ఈ సినిమాలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూ్స్ చేశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories