Mokshagna – వస్తున్నా..  మీ అందరి ఆశీస్సులు కావాలి

నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి ఎంతోకాలంగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ హీరో కావడానికి కావాల్సిన ఫిజిక్‌ కోసం కసరత్తులు చేస్తూ, యాక్టింగ్‌ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నారని ఎప్పటి నుంచో టాక్‌ నడుస్తోంది. మంచి కథ, దర్శకుడు కుదిరినప్పుడు తప్పకుండా హీరోగా వస్తాడని బాలయ్య కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 

ముందు బోయపాటి శ్రీనునే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తారని కొందరు, కొత్త దర్శకుడితో వస్తాడని మరి కొందరు అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టత లేదు. తాజాగా మోక్షజ్ఞ లేటెస్ట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో  తెగ వైరల్‌ అవుతున్నాయి. స్లిమ్‌గా, హ్యాండ్‌సమ్‌గా ఉన్న ఫొటోలను ఎక్స్‌లో షేర్‌ చేసి ‘వస్తున్నా..  మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని మోక్షు రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ కావడంతో మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖాయమైందని నందమూరి అభిమానులు ఆనందిస్తున్నారు. 

అయితే దీనితో ఎంత నిజం ఉంది.. మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసేది ఎవరన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నెటిజన్లు దీని గురించి అప్పుడే సెర్చింగ్‌ మొదలు పెట్టేశారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories