మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘లూసిఫర్2: ఎంపురాన్ (రాజు కన్నా గొప్పవాడు)’ రానుంది. అయితే, తాజాగా ఈ సినిమా షూట్ పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్‌లాల్ తాజాగా ఓ పోస్టులో వివరించారు.
ఇంతకీ, మోహన్ లాల్ తన పోస్ట్ లో ఏం రాసుకొచ్చారంటే.. ‘సినిమా చిత్రీకరణ ముగిసింది. 14 నెలల సమయం.. ఎనిమిది రాష్ట్రాలు.. యూఎస్, యూకే, యూఏఈ తో పాటు నాలుగు దేశాలు.. ఇదొక అద్భుతమైన అనుకొని ప్రయాణం.. ప్రతి ఫ్రేమ్‌ని ఎలివేట్ చేసే సృజనాత్మకత పృథ్వీరాజ్ సుకుమారన్ కే సాధ్యం.
స్క్రీన్ ప్లేతో ఈ కథకు ప్రాణం పోసిన మురళీ గోపీ, మాపై నమ్మకం ఉంచి ఎంతోగానో సపోర్ట్ చేసిన నిర్మాతలకు స్పెషల్ థ్యాంక్స్. నటీనటులు, టెక్నికల్ టీమ్ సమష్టి సహకారంతోనే మేము దీనిని సాధించగలిగాం. మమ్మల్ని ఎంతగానో ఆరాధించే అభిమానుల ప్రేమే.. మాపై నమ్మకాన్నిపెంచింది’ అంటూ మోహన్ లాల్ తన పోస్ట్ లో వివరించారు. మరి ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో విజయం అందుకుంటుందో వేచి చూడాల్సిందే.