న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న భారీ ప్రాజెక్ట్ “ది ప్యారడైజ్” పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ బాబు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలిసింది. ఇప్పుడు ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
నాని మాస్ అవతారంతో షాక్ ఇస్తాడనుకున్నారు కానీ మోహన్ బాబు కూడా కొత్త మేకోవర్ లో కనిపించి మరింత ఆకర్షించారు. ఆయన లుక్ చూసి అభిమానులు పూర్తిగా ఇంప్రెస్ అయ్యారు. లుక్ ఇలా ఉంటే సినిమాలో ఆయన నటన ఎంత పీక్ లెవెల్ లో ఉండబోతుందో అనిపిస్తోంది.