దుబాయ్‌ లో మోహన్‌ బాబు!

మోహన్‌ బాబు దుబాయ్‌ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కు హైకోర్టు నిరాకరించడం, కోర్టు ఇచ్చిన రిలీఫ్ మంగళవారంతో ముగియనుండటంతో ఆయన ముందు జాగ్రత్తగా దుబాయ్ వెళ్లినట్లుగా సమాచారం. గతంలో హైకోర్టు పోలీసులు ఇచ్చిన నోటీసులపై 24వ తేదీ వరకూ గడువిచ్చింది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం లేదు. ఆయన ముందస్తు బెయిల్ తిరస్కరింతడంతో అరెస్టు నుంచి రక్షణ కల్పించే అవకాశాలు కనపడడం లేదు.

మోహన్ బాబు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.ఆయన తన వద్ద ఉన్న తుపాకీల్ని సరెండర్ చేశారు. కానీ హత్యాయత్నం కేసు మాత్రం బలంగా నిలబడింది. పోలీసులు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. కుటుంబపరమైన సమస్యల్లో కేసులు నమోదు చేయడానికి పోలీసులు రెడీగా లేరు. అందుకే ఇప్పటి వరకూ వారి కుటుంబ గొడవల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కేసులు నమోదు చేసుకోలేదు. కానీ మీడియా ప్రతినిధిపై దాడి కేసు మాత్రం ఆయనకు సమస్య అయి కూర్చుంది.

ఇప్పటికే మోహన్ బాబు అందుబాటులో లేరు. ఆయన దుబాయ్ వెళ్లారని.. చెబుతున్నారు. వెళ్లి వచ్చేశారని  పోలీసులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని లాయర్లు చెబుతున్నప్పటికీ.. అరెస్టు ముప్పు ఉంటే మాత్రం తదుపరి న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకునే వరకూ ఆయన బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆయన ఆస్పత్రిలో బాధితుడ్ని పరామర్శించి మరో పెద్ద చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా మోహన్ బాబు కష్టాలు కొనసాగనున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories