మంచువారి కుటుంబంలో నెలకొన్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. మోహనబాబు చిన్నకుమారుడు మనోజ్, మోహన్‌బాబు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కేసులు పెట్టుకోవడం వంటివి తెలిసిందే.ఈ క్రమంలో సీపీ ఇరువురికి వార్నింగ్ ఇవ్వడం కూడా తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే మోహన్ బాబు ఓ మీడియా రిపోర్టర్ పై అమానుషంగా దాడి చేయడం జరిగింది.
దీంతో ఇది పెద్ద కాంట్రవర్సీగా మారింది. అయితే ఈ ఘటనపై మోహన్ బాబు తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాను గత 48 గంటల నుంచి హాస్పిటల్ లోనే ఉన్నాను అని అందుకే ఆ ఘటనపై వెంటనే స్పందిచలేకపోయాను అని చెప్పుకొచ్చారు. ఆ హీట్ మూమెంట్ లో నా ఇంటి గేటు బద్దలుకొట్టారు.
దాదాపు 30 నుంచి 50 మంది ఎవరో వచ్చేసారు. దీనితో నేను నా సహనం కోల్పోయాను ఆ సమయంలో జరిగిన దాడిపై చింతిస్తున్నాను అని అలాగే ఆ ఛానెల్ వారికి అతని కుటుంబానికి కూడా క్షమాపణలు చెప్పారు.