టాలీవుడ్ యంగ్ హీరోలు ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మిత్ర మండలి. ఇందులో నిహారిక ఎన్ ఎమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించగా, మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ట్రైలర్ చూస్తేనే సినిమా ఎలాంటి ఫన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందో స్పష్టంగా తెలుస్తోంది. మొదటి సీన్ నుంచే కామెడీ టచ్‌తో ట్రైలర్ సాగిపోగా, ప్రతి పాత్ర కూడా తన స్టైల్లో నవ్వులు పంచేలా కనిపిస్తోంది. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అయితే సూపర్‌గా ఉండగా, ప్రియదర్శి అండ్ టీమ్ డైలాగ్స్ కూడా చక్కగా నడిచాయి.
ఇక అనుదీప్ కే.వి, సత్య వంటి కమెడియన్లు కూడా తమ ట్రాక్‌లతో అదనపు ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. నిహారిక పాత్ర చుట్టూ తిరిగే లవ్ అండ్ ఫన్ యాంగిల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.