నిందలు వేయడంలో మిథున్ రెడ్డి అజ్ఞాన ప్రదర్శన!

రెండో దఫా కూడా ఎంపీగా నెగ్గిన విద్యావంతుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అమాయకత్వమో, అజ్ఞానమో, లేదా తన మాటల వెనుక ఏదైనా కుట్రకోణం ఉన్నదో అర్థం కావడం లేదుగానీ.. వరద సహాయక చర్యల విషయంలో చిత్రంగా మాట్లాడుతున్నారు. భారీ వర్షాలకు విజయవాడ నగరం యావత్తూ అతలాకుతలం అవుతోంటే.. చంద్రబాబునాయుడు సర్కారు చేపడుతున్న సహాయక చర్యల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఒక మంచి నమ్మకం కలుగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంత గొప్ప నాయకుడైనా సరే.. ప్రజలకు ఎంత అండగా ఉండి, వారిలో నమ్మకాన్ని కలిగించగలరో.. అంతకు మించి.. చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని ప్రజలందరూ అంటున్నారు. ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు.. పగలంతా కూడా బాధిత ప్రాంతాల్లోనే తిరుగుతూ.. అర్ధరాత్రి కూడా బోటులో కాలనీలకు వెళ్లి మొబైల్ ఫోను లైట్ల వెలుతురులో ప్రజలకు ధైర్యం చెబుతూ.. తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా ప్రజలతోనే గడిపిన ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రప్రజలు చరిత్రలో చూసి ఉండరు. అలాంటిది పెద్దిరెడ్డి మాత్రం చిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఫైల్స్ తగులబెట్టేశారని ఆరోపణలు వచ్చినప్పుడు.. తక్షణ విచారణ అవసరం కాబట్టి అప్పట్లో డీజీపీ ని మదనపల్లెకు హెలికాప్టర్ లో పంపిన వైనం గురించి మిధున్ రెడ్డి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ‘డీజీపీని హెలికాప్టర్ లో మదనపల్లికి పంపించారు.. వరద సహాయక చర్యలకు ఎందుకు పంపించలేదు అని ప్రశ్నిస్తున్నా’ అంటూ మిధున్ రెడ్డి నాటకీయ డైలాగులు చెబుతున్నారు. అంత సిల్లీ ప్రశ్న ప్రెస్ మీట్ లో అడగవచ్చునని ఆయనకు ఎలా అనిపించిందో తెలియదు.

భారీ వర్షాలు పడుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మామూలు హెలికాప్టర్లు ఎగరడం అనేది సాధ్యం కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాంటి పరిస్థితుల్లోనే వర్షం వస్తుండగా హెలికాప్టర్ ప్రయాణం చేసి దుర్మరణం పాలయ్యారు. అలాంటి చేదు, దారుణ అనుభవం తమ సొంత పార్టీ నేతకే ఉండి కూడా.. మిధున్ రెడ్డి ఆ ప్రశ్న ఎలా వేశారో అర్థం కావడం లేదు. మామూలు హెలికాప్టర్లు వాతావరణం ప్రశాంతంగా మారిన తర్వాత.. ఆహారపొట్లాలు వంటివి పంచడానికి ఉపయోగపడవచ్చు.. అంతే! కానీ ఇంకా కొన్నిరోజులు భారీ వర్ష సూచన ఉండగా.. వాటితో పని జరగదు. అందుకే ప్రత్యేకంగా భారత నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లను తెప్పించడం జరిగింది.

పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అమాయకత్వంతో ఈ ప్రశ్న అడిగారా.? అజ్ఞానంతో అడిగారా? లేదా, మామూలు హెలికాప్టర్లు పెడితే.. వాటివల్ల ప్రమాదాలు జరిగే ప్రజలు చనిపోతే.. చంద్రబాబు సర్కారు మీదు దుమ్మెత్తిపోయవచ్చుననే కుట్ర ఆలోచనతో అడిగారా ? అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories