పరారీలో మిథున్ : అరెస్టుకోసం వేటలో పోలీసులు!

గతంలో సిట్ విచారణకు సాక్షిగా హాజరైనప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి ఏం చెప్పాడో మీకు గుర్తుందా? ‘కేవలం రాజకీయ కక్ష సాధింపుతో మా కుటుంబం మీద రకరకాల కేసులు పెడుతున్నారు. అమ్మాయి అక్రమ రవాణా, డ్రగ్స్ కేసులు తప్ప అన్ని రకాల కేసులు మా మీద పెట్టారు. సవాలు చేసి చెబుతున్నా.. ఏ ఒక్క కేసును కూడా నిరూపించలేరు. ఏ ఒక్క కేసులోనూ మమ్మల్ని ఏమీ చేయలేరు..’ అని అన్నారు. కానీ.. పాపం ఆయన అంచనా తప్పు అని తేలుతోంది. ప్రస్తుతం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసిన తరువాత.. ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్టు కూడా తిరస్కరించిన తరువాత.. పరారీలో ఉన్న మిథున్ రెడ్డికి తన అంచనా తప్పు అనే విషయం అర్థం అవుతూ ఉండవచ్చు.

మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణంలో ప్రధాన భూమిక పోషించిన వారిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముఖ్యులు. ఆయన మాస్టర్ మైండ్ ప్రణాళిక ప్రకారమే లిక్కర్ కొత్త పాలసీ కూడా రూపుదిద్దుకున్నట్టు సిట్ విచారణలో తేలింది. పాలసీ మొత్తం ఎలా ఉండాలి.. లిక్కర్ డిస్టిలరీలనుంచి ఎలా దండుకోవాలి అనే ప్రణాళిక మొత్తం మిథున్ రెడ్డిది కాగా, క్షేత్రస్థాయిలో మద్యం కంపెనీల నుంచి బ్లాక్ మనీ రూపంలో వసూళ్లు చేయడానికి అవసరమైన నెట్వర్క్ మొత్తాన్ని రాజ్ కెసిరెడ్డి తన మనుషులతో నడిపించారు.

గతంలో సిట్ సాక్షిగా పెద్దిరెడ్డి మిథున్ర రెడ్డిని విచారణకు పిలిచినప్పుడు ఆయన చాలా ప్రగల్భాలు పలికారు. లిక్కర్ స్కామ్ గురించి విలేకరులు ప్రశ్నలు అడిగితే.. అసలు లిక్కర్ పాలసీ విషయంలో స్కామ్ అనేదే జరగలేదు. దాని గురించి మీరు ప్రశ్నలడిగితే ఏం చెప్పగలను అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అలాగే.. లిక్కర్ కొత్త పాలసీ కేవలం ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికి, ప్రభుత్వమే నిర్వహించేలా చేసిన మంచి ప్రణాళిక అని కూడా చెప్పుకొచ్చారు. ఈ బుకాయింపులకు ఇప్పుడు విలువ లేకుండా పోయింది.
పాపం మిథున్ రెడ్డి.. లిక్కర్ స్కాం విచారణ ప్రారంభమైన తొలిరోజుల్లో వాసుదేవరెడ్డి తదితర అధికార్లను ప్రాథమికంగా పోలీసులు విచారించినప్పుడే.. ముందస్తు బెయిలుకోసం పిటిషన్ వేసుకున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండానే, వాళ్లు మిమ్మల్ని అరెస్టు చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు.. అని కోర్టు అడిగినప్పుడు.. ప్రతికల్లో తన పాత్ర గురించి వచ్చిందని చెప్పారు. కోర్టు ఆవాదనను పట్టించుకోలేదు. అప్పటినుంచి మిథున్ లో అరెస్టు భయం ఉంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చారు. మిథున్ రెడ్డికి లిక్కర్ కుంభకోణంలో ముందస్తు బెయిలు పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన సమయానికే.. దాదాపుగా సిట్ కుంభకోణంలో ఆయన వాటా ఎంత అనే సంగతి కూడా తేల్చింది. ప్రతినెలా 5 కోట్ల రూపాయల వాటా ఆయనకు ముట్టేదని తేల్చారు. మిథున్ రెడ్డి.. సుప్రీంలో ముందస్తు బెయిలు కోసం అప్పీలు చేసుకోగా అక్కడ కూడా తిరస్కరణ తప్పలేదు. కనీసం అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి కూడా సుప్రీం నిరాకరించింది. అరెస్టు చేయకుండా అసలు చార్జిషీట్ ఎలా దాఖలు చేయగలరని అన్నది. ఈ నేపథ్యంలో ఆయన పరారీలోకి వెళ్లారు. సిట్ పోలీసులు ఆయన అరెస్టుకు వారంటు కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీచేసి ఉన్న నేపథ్యంలో ఆయన దేశందాటి వెళ్లే అవకాశం లేదు. అయితే దేశంలో ఏమూలన, ఏ కలుగులో దాక్కుని ఉన్నా సిట్ పోలీసులు వదలిపెట్టరని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories