హాలీవుడ్‌లో స్పై యాక్షన్ కథలంటే గుర్తొచ్చే పేర్లలో టాప్‌లో ఉండే సినిమానే మిషన్ ఇంపాసిబుల్. టామ్ క్రూజ్ నటించిన ఈ ఫ్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా ఈ సిరీస్‌లో వచ్చిన “ది ఫైనల్ రెకనింగ్” అనే పార్ట్ మే 17న థియేటర్లలో విడుదలై భారీ విజయం సాధించింది. టామ్ క్రూజ్ తన దెబ్బకి మళ్లీ ఫాన్స్‌ని మంత్రిముగ్దులను చేశాడు. అతని స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు చూసినవాళ్లు థియేటర్‌లోనే ఉబ్బితబ్బిబ్‌య్యారు.
క్రిస్టోఫర్ మెక్ క్వారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 589 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. సినిమా విజయం ఎలానే ఉందొకానీ, ఇప్పుడు ఇది ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు యాపిల్ టీవీలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఆగస్టు 19 నుంచి వీటి ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
ఇప్పటికే థియేటర్లలో ఈ మూవీని మిస్ చేసినవాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. స్క్రీన్‌పై సూపర్ యాక్షన్ చూసే మజాను ఇంట్లోనే అనుభవించేందుకు ఇది మంచి అవకాశం. మరి థియేటర్‌లో హిట్ అయిన ఈ స్పై థ్రిల్లర్, ఓటీటీ ప్రేక్షకుల మనసు ఎలా గెలుచుకుంటుందో చూడాలి.