మిరాయ్‌ టైలర్‌ కి ముహుర్తం కుదిరింది!

యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘మిరాయ్’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా, ఇందులో తేజ ఒక శక్తివంతమైన యోధుడిగా కనిపించనున్నాడు. ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలు పెంచాయి.

ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదలకు సిద్దమైంది. ఆగస్టు 28న మధ్యాహ్నం 12.06 గంటలకు థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ట్రైలర్ ద్వారా సినిమాలోని ఫాంటసీ యాక్షన్ వాతావరణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు.

మంచు మనోజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతుండటం మరింత ఆకర్షణగా మారింది. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని గౌర హరి అందిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories