యూఎస్‌ లో మిరాయ్‌ సెన్సేషనల్‌ ఓపెనింగ్స్‌!

టాలీవుడ్‌లో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా, రితిక నాయక్ హీరోయిన్‌గా నటించిన తాజా యాక్షన్ డ్రామా “మిరాయ్”కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం తేజ సజ్జ కెరీర్‌లో మరో పెద్ద ఆరంభం అందించిన సినిమాగా మారింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా ప్రభావం బాగా కనిపిస్తోంది.

అమెరికాలో ప్రీమియర్స్‌తో పాటు మొదటి రోజే సుమారు 7 లక్షల డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. మిడ్ రేంజ్ హీరోస్‌లో ఇంత భారీ ఓపెనింగ్ సాధించడం తేజ సజ్జకి ఒక ప్రత్యేకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇక వీకెండ్ కల్లా ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories