టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి అందరికీ తెలిసిందే. శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడి మునిగి తేలుతోంది. అయితే తమన్నా ప్రేమ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఆమె పెళ్లి ఎప్పుడు? అనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. మీ పెళ్లి కబుర్లు ఏమైనా చెప్పమని తమన్నాని అడిగితే ఆమె చెప్పిన సమాధానం వింటే షాక్ అవ్వాల్సిందే.
నేను పెళ్లి చేసుకోవడం లేదు కంగారు పడవద్దు అంటూ కామెంట్ చేసింది. అయితే విజయ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్న మాట వాస్తవమే కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆమె అనుకోవడంలేదని తాజా కామెంట్స్ తో ఓ క్లారిటీ ఇచ్చింది. ఇక తమన్నాకి తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె ఎక్కువగా హిందీలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. హిందీలో హీరోయిన్ గా మాత్రమే కాకుండా అతిథి పాత్రలు కూడా ఏమాత్రం కాదనకుండా చేసుకుంటు వెళ్తుంది.
చివరి డెస్టినేషన్ ఎలాగో హీరోయిన్లకు బాలీవుడ్డే కాబట్టి ఇకపై బాలీవుడ్ లోనే ప్రాజెక్టులు చేసేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో అవకాశాలు వస్తే కూడా వెనక్కి తగ్గకుండా అవి కూడా ఒప్పుకునేందుకు ఆమె రెడీగా ఉంది.