మెగాస్టార్ సినిమా ముగింపు అప్పుడే

టాలీవుడ్‌ పద్మ  విభూషణుడు చిరంజీవి హీరోగా,  స్టార్ నటి , అందాల తార త్రిష హీరోయిన్‌ గా నటిస్తున్న చిత్రం విశ్వంభర.. ఈ సినిమా ని వశిష్ట తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా ని భారీ విజువల ట్రీట్‌ చిత్రంగా తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర బృందం ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలుకు తగ్గట్లుగానే సినిమా షూటింగ్‌ కూడా చాలా వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం తెరమీదకు వచ్చింది. ఇంతకుముందు ప్రకటించినట్లుగానే జులై చివరికల్లా సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తి అవుతుందని చిత్ర బృందం తెలిపిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ విషయం నిజమే అని తెలుస్తుంది. మూవీ మేకర్స్‌ విశ్వంభర షూటింగ్ ని జులై నాటికి మొత్తం పూర్తి చేసేస్తారట.ఆ తర్వాత నుంచి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మెయిన్ గా సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసమే జులై నుంచి జనవరి వరకు కేటాయించినట్టుగా తెలుస్తుంది.

అవి కూడా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి మెగా అభిమానులకు  భారీ ట్రీట్ ని మేకర్స్ ఇవ్వబోతున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories