మెగాస్టార్‌ పిరికివాడు…నటి సంచలన కామెంట్స్‌!

మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి హేమ కమిటీ..ఓ నివేదిక ను సిద్దం చేసిన సంగతి తెలిసిందే. హేమ కమిటీ రూపొందించిన రిపోర్టులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు.. నటీమణులను ఓ ఆటబొమ్మలా చూస్తారని ఈ కమిటీ పేర్కొంది. ఈ రిపోర్ట్ వచ్చిన తరువాత చాలా మంది నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ  మొత్తం ఈ వ్యవహరం గురించే మాట్లాడుకుంటుంది.

హేమ కమిటీ నివేదిక తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు, మెగాస్టార్ మోహన్‌లాల్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మ) అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. కేవలం ఆయన మాత్రమే కాకుండా ఆయనతో పాటు ఆ కమిటీ లో ఉన్న 17 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు. ఈ మూకుమ్మడి రాజీనామాల నిర్ణయంపై హీరోయిన్ పార్వతి స్పందించారు.

ఈ విషయాన్ని మీడియాకు వివరించే స్థితిలో ఉన్న మోహన్‌లాల్ వైదొలగడం అనేది పిరికిపంద చర్య అని ఆమె విమర్శించారు. అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం పిరికిపంద చర్య అని చెప్పుకొచ్చారు.  ఓ ఇంటర్వ్యూలో పార్వతి మాట్లాడుతూ… ‘ఈ వార్త వినగానే నేను ముందు నేను  చాలా షాక్‌ అయ్యా. ఇది ఎంత పిరికితనం. ఈ కమిటీ గురించి అసలు విషయాన్ని గురించి మీడియాకు వివరించే స్థితిలో ఉన్న వాళ్లు తమ బాధ్యతల నుంచి వైదొలగడం పిరికితనమే. రాజీనామా చేయకుండా ప్రభుత్వంతో కలిసి పని చేస్తే చాలా బాగుండేది. నేను కూడా గతంలో అమ్మలో భాగమే.

వారు ఎలా పని చేస్తారో నేను చూశాను. నేను అసోసియేషన్‌కు రాజీనామా చేయడానికి ఒక కారణం ఉంది. మహిళల అవసరాల గురించి మాట్లాడే హక్కు నటీమణులకు లేదు. సమాజానికి ఇపుడు అంతా తెలిసింది. ఈ పరిస్థితి మారాలంటే మెరుగైన నాయకత్వం చాలా అవసరం ఉంది. రాబోయే రోజుల్లో అయినా ప్రతి ఒక్కరూ మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది’ అని ఆమె చెప్పుకొచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories