మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల మీద పూర్తి దృష్టి పెట్టారు. వరుసగా కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన, అభిమానులకు పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను అలరించేందుకు ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే కామెడీ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
ఇవే కాకుండా చిరంజీవి తన తర్వాతి సినిమాలపై కూడా వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన, ఇప్పుడు మరో దర్శకుడితో కూడా ప్రాజెక్ట్ ఫైనల్ చేసినట్లు సమాచారం. యువ దర్శకుడు వెంకీ కుడుముల ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేశాడని, దాన్ని చిరంజీవికి చెప్పగా ఆయనకు నచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.