మీమ్ గాడ్ కోసం మెగాస్టార్! హాస్యబ్రహ్మ పద్మశ్రీ డా.బ్రహ్మానందం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్రహ్మా ఆనందం’ ఫిబ్రవరి 14న మంచి బజ్‌తో రిలీజ్‌కు రెడీ అయ్యింది. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం ఫుల్ ప్లెడ్జ్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.
ఇక ఈ చిత్రంలో రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంటుంది. దీంతో ఈ మూవీకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఇక ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. బ్రహ్మానందంతో చిరంజీవికి ఎలాంటి సాన్నిహిత్యం ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిరు, బ్రహ్మీ ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.