మెగా ఫ్యామిలీ నుంచి మళ్లీ ఒక శుభవార్త వచ్చింది. ఇప్పటికే మెగా హీరోలు అందరూ బిజీగా పలు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. అదే సమయంలో వాళ్ల వ్యక్తిగత జీవితం కూడా బాగా హ్యాపీగా సాగిపోతోంది. కొన్నాళ్ల కితప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ వారి కొత్త జీవితం ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇప్పుడు వీరి నుంచి ఇంకో గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ సోషల్ మీడియా ద్వారా తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఒక అందమైన ఫొటోను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఈ శుభవార్త తెలిసిన వెంటనే సినీ ఇండస్ట్రీకి చెందిన వారు, నెటిజన్లు, అభిమానులు అందరూ వారిద్దరికీ శుభాకాంక్షలు చెబుతున్నారు. కామెంట్స్ లో తమ ప్రేమను వ్యక్తం చేస్తూ, మంచి విషెస్ తెలియజేస్తున్నారు. వరుణ్–లావణ్యలకు ఇది జీవితంలో మరొక కొత్త అధ్యాయం అన్నట్టుగా, ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఇలాంటి హ్యాపీ మోమెంట్స్ మెగా ఫ్యామిలీ నుంచి రావడం ఫ్యాన్స్‌కు డబుల్ సర్‌ప్రైజ్ లా మారుతోంది.