మెగా కోడలి కాలికి గాయం…ఇంటికే పరిమితం!

ఏపీలో మంత్రిగా పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు మెగా కుటుంబమంతా  మంగళవారం నాడే గన్నవరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే వారందరూ ప్రమాణ స్వీకారానికి వెళితే మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాత్రం ఇంటికి పరిమితం అయ్యింది.

ఎందుకంటే ఆమె కాలికి గాయమైంది. తన కుడికాలికి గాయం అయిందని, తాను ప్రస్తుతానికి కోలుకుంటున్నాను అంటూ ఆమె సోషల్‌ మీడియాలో ఓ ఫోటో షేర్‌ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందిన రోజున తన అన్న ఆశీర్వాదం కోసం చిరంజీవి ఇంటికి  వెళ్లారు. ఆ సమయంలో వరుణ్ తేజ్ తో పాటు లావణ్య త్రిపాఠి కూడా ఉంది.

కానీ ఆ సమయంలో ఆమె కాలికి ఎలాంటి కట్టు కనిపించలేదు. ఆ తరువాత ఆమె కాలికి గాయమైనట్లుగా సమాచారం. అయితే ఈ గాయం షూటింగ్ చేస్తున్న సమయంలో జరిగిందా? లేక ఇంట్లోనే  గాయం అయ్యిందా  అనే దాని మీద మాత్రం సమాచారం లేదు. ఇక గాయమైన నేపథ్యంలో ఆమె పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయినట్లుగా సమాచారం. 

Related Posts

Comments

spot_img

Recent Stories