మ్యాడ్‌ హీరోతో మెగా డాటర్‌!

మ్యాడ్ చిత్రానికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ రెస్పాన్స్ దక్కిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రాగా, ఇది బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు కల్యాణ్ డైరెక్ట్ చేశారు. కాగా, ఇందులోని కామెడీ ఎలిమెంట్స్, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్ తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

ఇక ఈ సినిమాలో నటించిన సంగీత్ శోభన్ ప్రస్తుతం ఓ కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. మెగా డాటర్ నిహారిక ప్రొడక్షన్ కంపెనీ ది పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌లో సంగీత్ శోభన్ తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేశారు. నిహారిక సరసన సంగీత్ శోభన్ నటిస్తుండటంతో ఈ కాంబినేషన్ ఎంతమేర అలరిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాను మానసా శర్మ డైరెక్ట్ చేయనున్నారు.

మరి ఈ సినిమాలో నిహారిక, సంగీత్ శోభన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ చిత్ర షూటింగ్ త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories