మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసిందోచ్‌!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ విశ్వంభర నుంచి తాజాగా వచ్చిన గ్లింప్స్ అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియోలో సినిమా స్థాయి ఏ మేరకు ఉండబోతుందో స్పష్టంగా కనిపిస్తోంది. దర్శకుడు వశిష్ట ముందే చెప్పినట్లుగా ఇది సాధారణ సినిమా కాదని, కొత్త స్థాయిలో రూపొందుతోందని ఈ చిన్న క్లిప్‌తోనే అర్థమవుతోంది.

ప్రపంచాల మధ్య ప్రయాణం చేసే కథా కాన్సెప్ట్‌తో విశ్వంభరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ ఈ సినిమాకి ప్రధాన బలం అవుతుందని మేకర్స్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్ చూస్తే ఆ మాట నిజమని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇంత భారీ స్థాయి గ్రాఫిక్స్ కారణంగానే రిలీజ్ వాయిదా పడుతోందని చిత్ర బృందం ముందుగానే తెలిపింది.

గ్లింప్స్‌ను గమనిస్తే మేకర్స్ ఎంత జాగ్రత్తగా ప్రతి ఫ్రేమ్‌ను డిజైన్ చేశారో స్పష్టమవుతోంది.  

Related Posts

Comments

spot_img

Recent Stories