మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమాల్లో ఒకటి దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్. ఇది ఆయన కెరీర్లో 157వ చిత్రం కావడం విశేషం. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ వీడియోను విడుదల చేస్తామని ముందుగానే మేకర్స్ చెప్పగా, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
ఈ చిత్రానికి “మన శంకర్ వరప్రసాద్ గారు” అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో చిరంజీవిని వింటేజ్ స్టైల్లో చూపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. బ్లాక్ సూట్లో తనదైన స్టైల్లో నడుస్తూ వస్తున్న మెగాస్టార్ లుక్‌ను చూసి అభిమానులు మంత్రముగ్ధులైపోతున్నారు.
అదే సమయంలో, చిరంజీవి సూపర్‌హిట్ సినిమా రౌడీ అల్లుడు నుంచి ఓ పాట స్కోర్‌ను భీమ్స్ మిక్స్ చేయడం ఈ గ్లింప్స్‌కి అదనపు హంగు జోడించింది. ఫ్యాన్స్ ఈ మ్యూజిక్ టచ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.