టాలీవుడ్‌లో క్రమంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ ఫేవరెట్‌గా మారింది. ఆమె చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు అందుకోవడంతో కెరీర్ వేగంగా ముందుకు వెళ్తోంది. స్టార్ హీరోల సినిమాల్లోనూ, యంగ్ హీరోల ప్రాజెక్ట్‌లలోనూ ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు రావడం విశేషం.
ఇక తాజాగా ఈ అమ్మాయి చూపు బాలీవుడ్ వైపు మళ్లినట్టు సమాచారం. ఇప్పటికే టాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఆమెకు, ఇప్పుడు హిందీ ఆఫర్లపై ఆసక్తి పెరిగిందట. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం హీరోగా రూపొందనున్న ఫోర్స్ 3 సినిమాలో మీనాక్షి హీరోయిన్‌గా ఎంపికైనట్టు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తలు బయటకు వస్తున్నాయి.