“మెకానిక్ రాకీ” గ్లింప్స్ లాంఛ్ కి ఖరారైన ముహుర్తం!

యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, రవితేజ ముళ్లపూడి కాంబోలో  రూపుదిద్దుకుంటున్న సినిమా మెకానిక్ రాకీ. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31, 2024న థియేటర్లలోకి విడుదల కాబోతుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నట్లు మూవీ మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను మూవీ మేకర్స్‌ విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు.

ఈ సినిమా గ్లింప్స్ ను జులై 28, 2024 న ఉదయం 11:11 గంటలకి హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌లో లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వివరించారు. ఈ సినిమాలో నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి అవ్వనున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories