కుంభమేళాలో అఖండ మాస్‌ క్రేజ్‌ వైరల్‌!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా “డాకు మహారాజ్” తో తన కెరీర్లో మరో సాలిడ్ హిట్ ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మూవీ హిట్ కి ముందు బాలయ్య 2.0 కి పునాది వేసిన సెన్సేషనల్ హిట్ సినిమా “అఖండ” అన్న సంగతి తెలిసిందే.

బోయపాటి శ్రీను డైరెక్షన్‌ లో తెరకెక్కించిన ఈ భారీ సినిమా బాలయ్యకి నెక్స్ట్ లెవెల్ కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా అక్కడ నుంచి వరుస హిట్స్ తో బాలయ్య ఫామ్ లోకి వచ్చేలా చేసింది. ఇక ఇపుడు దీనికి సీక్వెల్ “అఖండ 2” తాండవంగా రాబోతుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ పార్ట్ 2 షూటింగ్ ని ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళాలో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇలా నిజమైన కుంభమేళాలో మొదలైన ఈ సినిమాపై లేటెస్ట్ పార్ట్ 1 మాస్ క్రేజ్ కనిపిస్తుంది.

అక్కడ అఖండ బాలయ్య పెయింటింగ్ తో కూడిన వెస్ట్ బెంగాల్ బస్సులు కనిపించాయి. దీంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి పార్ట్ 1 కి హిందీ ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. పార్ట్ 2 కూడా నార్త్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ లో వర్క్ అవుతుంది అని మేకర్స్ అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories