నల్లంచు..తెల్ల చీర అంటూ వచ్చేసిన మాస్‌ మహారాజా!

మాస్ రాజా రవితేజ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన తాజా సినిమా  ‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మూవీ మేకర్స్‌ తీర్చిదిద్దారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు మేకర్స్ మరో మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

ఈ మూవీలోని ‘నల్లంచు తెల్లచీర’ సాంగ్ ప్రోమోను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ పాట కూడా పూర్తి మాస్ ట్యూన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకోనుంది. ఈ సాంగ్‌ను శ్రీరామచంద్ర, సమీర భరద్వాజ్ కలిసి పాడారు. మిక్కీ జే మేయర్ ఈ పాటకు చక్కటి మాస్ ట్యూన్స్ అందించాడు. ఇక ఈ సాంగ్‌ను సోమవారం జరిగే  ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మేకర్స్ విడుదల చేయబోతున్నారు.

పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు విలన్ పాత్రలో చేస్తుండగా… పీపుల్ మీడియ ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఆగస్టు 15న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్దమైంది.

Related Posts

Comments

spot_img

Recent Stories