మాస్ రాజా రవితేజ నటిస్తోన్న తాజా సినిమా ‘మాస్ జాతర’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, పూర్తి మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోలు, పోస్టర్లు సినిమా మీద మంచి ఆసక్తి కలిగించాయి. ప్రేక్షకుల్లో ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.
ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత రవితేజ తన తరువాత సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈసారి ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాను వచ్చే జూన్‌లో అధికారికంగా ప్రారంభించాలనే ప్లాన్‌లో యూనిట్ ఉంది. ఇప్పుడు ఈ కొత్త సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. రవితేజ సినిమా టైటిల్‌గా ‘అనార్కలి’ అనే పేరు ఫిక్స్ చేసేందుకు టీమ్ రెడీ అవుతున్నట్టు సమాచారం.
ఇప్పటివరకు రవితేజ చేసిన సినిమాలకు ఈ టైటిల్ సరిగ్గా వేరుగా ఉండడం విశేషం. అందుకే ఈ కొత్త టైటిల్‌తో సినిమా మీద మరింత అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా కేతిక శర్మ నటించబోతున్నది. మరోవైపు సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించనున్నాడు. మొత్తం మీద రవితేజ కొత్త సినిమాలు ఆయన ఫ్యాన్స్‌లో మంచి ఆసక్తి రేపుతున్నాయి.