డైరెక్టర్ ని కొట్టిన మంతెన అభిమానులు! కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా వచ్చిన మూవీ “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. అయితే ఈసినిమాలో ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణను కించపరుస్తూ కొన్ని సీన్లు తీశారు. దీంతో, మంతెన సత్యనారాయణ అభిమానులు ఈ సినిమా టీమ్ పై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఈ సినిమా డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టిపై మంతెన సత్యనారాయణ అభిమానులు దాడికి దిగారు. ఈ దాడి కలకలం రేపుతోంది. ‘డ్రింకర్ సాయి’ సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా చిత్రబృందం గుంటూరులోని శివ థియేటర్ వద్దకు వెళ్లారు.
దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి కూడా శివ థియేటర్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఉండగా.. వెనుక నుంచి కొందరు మా మంతెన నే కించపరుస్తూ సీన్లు తీస్తావా ? అంటూ డైరెక్టర్ పై దాడి కి దిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.