మనోజ్‌ బర్త్‌ డే ట్రీట్‌ అదిరిపోయింది!

టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో భైరవం ఒకటి. ఈ చిత్రం మొదటి నుంచి బజ్‌లో ఉంది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో మంచు మనోజ్ గజపతి అనే ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్‌లోనే తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న మనోజ్, ఈ పాత్రతో అలాగే ఫుల్ ఎనర్జీతో మళ్లీ స్క్రీన్ మీద మోగించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అతని పాత్రపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది.

తాజాగా ఈ చిత్ర బృందం గజపతి పాత్రకు సంబంధించిన ఓ స్పెషల్ థీమ్ మ్యూజిక్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు. థీమ్ ఆఫ్ గజపతి పేరుతో మే 20వ తేదీ సాయంత్రం 4.05కు ఈ మ్యూజిక్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాకు సంగీతం శ్రీచరణ్ పాకాల అందిస్తున్నాడు. నిర్మాణ బాధ్యతలు కెకె రాధామోహన్ తీసుకున్నారు. యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించే ప్రయత్నంగా భైరవం రూపొందుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories