తిన్నడుగా ఆకట్టుకున్న మంచు అవ్రామ్‌

మంచు వారి కుటుంబం నుంచి మరో తరం వెండి తెర పై సందడి చేయడానికి రెడీ అయ్యింది. యువ నటుడు మంచు విష్ణు కుమారుడు అవ్రామ్‌ కన్నప్పలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా నేడు కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్‌ లుక్‌ ను కన్నప్ప టీమ్‌ విడుదల చేసింది.

అవ్రామ్‌ తిన్నడుగా నటించాడు. మంచువిష్ణు చిన్నప్పటి పాత్రను ఇందులో అవ్రామ్‌ పోషిస్తున్నాడు. ఈ పోస్టర్‌ను మోహన్‌ బాబు పోస్ట్‌ చేసి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కన్నప్ప’ సినిమా విషయానికొస్తే.. మంచు విష్ణు టైటిల్‌ పాత్రలో ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ డైరెక్షన్‌ లో పాన్‌ ఇండియా సినిమా గా ఇది రానుంది.

ఈ సినిమాని మోహన్‌బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్‌ కథానాయికగా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అక్షయ్‌ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్‌ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా టీజర్ బాగానే ఆకట్టుకుంది. సినిమా పై అంచనాలను పెంచింది.

Related Posts

Comments

spot_img

Recent Stories