కాశినాయనపై ఇంత ప్రేమ, భక్తి పొంగుతోందే మల్లాదీ!

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పరిధిలో.. నల్లమల అడవుల్లో ఉండే కాశినాయన జ్యోతిక్షేత్రం, ఆశ్రమం పరిధిలో కొన్ని షెడ్లను అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం అనేది తప్పే. ఆ ఆశ్రమానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని పట్టించుకోకుండా.. ఏదో నిబంధనల పేరు చెప్పి ప్రభుత్వానికి కూడా కనీస సమాచారం లేకుండా ఆ షెడ్లను అటవీ అధికారులు కూల్చేయించారు. ఆ తప్పిదాన్ని త్వరగానే గుర్తించిన ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఆ షెడ్లను తన సొంత నిధులతో తిరిగి నిర్మింపజేస్తానని మంత్రి నారా లోకేష్ ఆశ్రమం స్వామికి హామీ ఇచ్చారు. క్షమాపణ కూడా కోరారు. ఇప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఆవేశం పొంగుకొచ్చింది. కాశినాయన ఆశ్రమంపై ఆయన వల్లమాలని ప్రేమను, భక్తిని హఠాత్తుగా కురిపిస్తున్నారు.

కాశినాయన ఆశ్రమంలో షెడ్లను కూల్చివేయడం అనేది ఖచ్చితంగా అధికారుల తప్పు. ఏ ప్రభుత్వంలోనైనా అధికారులు అనేక సందర్భాల్లో అదుపు తప్పి, ప్రభుత్వం ఇరుకున పడేలాంటి తప్పులు చేయడం కొత్త విషయం కాదు. అయితే.. జరిగిపోయినది తప్పు అని ఒప్పుకునే ధైర్యం చాలా మందికి ఉండదు. జగన్ హయాంలో కూడా అనేక తప్పులు జరిగాయి. ప్రభుత్వం పరంగా పొరబాటు జరిగింది, తప్పు జరిగింది.. అని ఒక్కమాట కూడా నాయకుల నోటినుంచి రాలేదు.

రథం దగ్ధమైనా, విగ్రహాలను కూల్చివేసినా, గుడుల్లో దొంగతనాలు జరిగినా.. ఏం జరిగినా.. అధికారుల వైఫల్యం ఉన్నదని.. ప్రభుత్వం పూచీ వహిస్తుందని ఒక్కమాట కూడా పాలకులు ఎన్నడూ పలకలేదు. కేవలం.. ఆకతాయి, మతిస్థిమితం లేని చర్యలుగా కొట్టిపారేసి.. ప్రభుత్వసొమ్ముతో తిరిగి పూరించారు.
కూటమి ప్రభుత్వం అలా కాదు. తప్పును ఒప్పుకున్న ధైర్యం వారికి ఉంది. క్షమాపణ అడిగే ధైర్యం కూడా నారా లోకేష్ ప్రదర్శించారు. తన సొంత డబ్బులు పెడతానని ఎంతో ఔదార్యం చూపించారు.

కాశినాయన ఆశ్రమం పట్ల ప్రభుత్వ స్పందనకు  కడప జిల్లాలో ప్రజలు నీరాజనం పడుతుండేసరికి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఓర్వలేక మీడియా ముందుకు వచ్చారు. వైసీపీ పోరాటాల వల్లనే ప్రభుత్వం షెడ్లు తిరిగి నిర్మిస్తున్నదని అంటున్నారు. అక్కడికేదో ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ తమ పోరాటాల పుణ్యమే అని బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కాశినాయన ఆశ్రమం చాలా గొప్పదని, పరమపవిత్రమైనదని, మహారాష్ట్ర, కర్నాటక నుంచి కూడా భక్తులు బాగా వస్తుంటారని ఇప్పుడు సెలవిస్తున్నారు.

ఇక్కడ ప్రజల సందేహం ఒక్కటే.. కాశినాయన క్షేత్రం గురించి వైసీపీ వారికి అంత ప్రేమ ఉంటే.. అక్కడకు ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పించాలని ఎన్నాళ్లనుంచో కోరుతున్నా.. అయిదేళ్ల వారి పాలనలో ఎందుకు పట్టించుకోలేదు? జగన్ సొంత జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక క్షేత్రానికి ఆ మాత్రం చేయలేకపోయారు.. ఎందుకు? ఇప్పుడు లోకేష్ బస్సు కూడా వేయిస్తానని అంటున్నారు. కాశినాయన జ్యోతిక్షేత్రం గొప్పతనం పట్ల నిజంగా శ్రద్ధ ఉన్నవారే అయితే.. జగన్ గానీ, ఆయన దళాలు గానీ.. అయిదేళ్లలో ఎందుకు బస్సు వేయించలేదు అనేది ప్రజల సందేహం! మల్లాది ఏం చెబుతారో?

Related Posts

Comments

spot_img

Recent Stories