రజినీ సినిమాలో జాయిన్‌ అయిన మలయాళ సూపర్‌ స్టార్‌!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న భారీ ప్రాజెక్ట్ జైలర్-2 షూటింగ్ ఈ మధ్యే ప్రారంభమై వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్, ఈ సారి మరింత మాస్ మసాలా యాక్షన్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే మొదటి భాగంలో రజినీతో కలిసి కనిపించిన మలయాళ స్టార్ మోహన్‌లాల్ మరోసారి ఈ సీక్వెల్‌లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఇప్పటికే సెట్స్‌లో జాయిన్ అయ్యారు. త్వరలో ఆయన దృశ్యం-3 చిత్రాన్ని స్టార్ట్ చేయబోతున్నా, అంతకు ముందు జైలర్-2లో తన భాగాన్ని పూర్తి చేయాలని చూస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఇక ఈసారి జైలర్-2లో మరో బిగ్ సర్ప్రైజ్ కూడా ఉంది. టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ స్పెషల్ రోల్ చేస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆయన పాత్ర చిన్నదైనా సినిమాకు పవర్ పెంచేలా ఉండనుందని ఇండస్ట్రీ టాక్.

ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సీక్వెల్‌కు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. మొదటి పార్ట్‌లో హిట్ అయిన బీజీఎమ్‌లా, ఈసారి కూడా మంచి మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ఆయన పనిచేస్తున్నాడు.

ఇంతటి క్రేజీ కాంబినేషన్స్ ఉన్న జైలర్-2, రజినీకాంత్ అభిమానులకే కాకుండా అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేపుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories