సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కూలీ. బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని మూవీ టైటిల్ ని అనౌన్స్ చేసిన రోజే వీడియోతో చిత్ర బృందం చెప్పకనే చెప్పింది. రజినీ కెరీర్లో 171 వ ప్రాజెక్టుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ ని బట్టి లోకేష్ కనగరాజ్ ఈసారి రజినీకాంత్ ని వెండితెరపై సరికొత్తగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ఈ సినిమాలో ఓ మలయాళ స్టార్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నాడట.
రజినీకాంత్ ‘కూలీ’ మూవీలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఫహద్ ఫాసిల్ ఇప్పటికే రజినీ కాంత్‌తో ‘వేట్టయ్యన్’ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరి కాంబో ’కూలీ’లో మళ్లీ రిపీట్ కానుంది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘విక్రమ్’ సినిమాలోనూ అండర్‌కవర్ ఏజెంట్‌గా నటించాడు ఫహద్ ఫాసిల్. ఇక ఈసారి కూలీ మూవీలో కూడా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర బృందం నుంచి దీని గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.