కాంతార ఛాప్టర్‌ 1 లో మలయాళం నటుడు!

కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి నటించిన కాంతార సినిమా జాతీయ స్థాయిలో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి ప్రీక్వెల్‌గా కాంతార చాఫ్టర్‌-1 రెడీ అవుతుంది. రిషబ్‌ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన కాంతార చాఫ్టర్‌ 1 ఫస్ట్ లుక్‌, టీజ‌ర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈసారి కూడా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం పక్కా అని టీజర్‌ బట్టి తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్‌ గా జరుగుతుంది. కాంతార చాఫ్టర్‌-1 ప్రముఖ నటుడు కీ రోల్‌ చేస్తున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్  గా మారింది. మలయాళం యాక్టర్ జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. జయరామ్ ఇప్పటికే కాంతార షూట్‌లో జాయిన్‌ అయ్యాడని సమాచారం. మరి దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన చేస్తారా? అన్న దాని మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

భాగమతి, అల వైకుంఠపురంలో, గుంటూరు కారం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు జయరామ్ సుపరిచితుడే. కాంతార ప్రీక్వెల్‌తో జయరామ్‌ నటిస్తే.. ఆయన స్టేటస్‌ పాన్ ఇండియా రేంజ్‌లో మార్మోగిపోవడం గ్యారంటీ. ‘కాంతార ఏ లెజెండ్’ అనే పేరుతో చాఫ్టర్‌-1 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories